అడివిశేష్ నుండి రాబోతున్న సరికొత్త థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్షన్లో పర్ఫెక్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన హిట్ ది ఫస్ట్ కేసు కు ఈ సినిమా కొనసాగింపుగా రూపొందింది. మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, రెండవ పార్ట్ లో శేష్ హీరోగా నటిస్తున్నారు.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో శేష్ మాట్లాడుతూ... హిట్ 2 లో మరొక హీరో కూడా ఉన్నాడని, ఆయన హిట్ 2 క్లైమాక్స్ లో పరిచయం అవుతారని, అతనితో హిట్ 3 చిత్రం ఉంటుందని, ఆయనే హిట్ 3 మూవీ హీరో అని తెలిపారు. ఈ విషయం నిజంగా ఆడియన్స్ ను సూపర్ ఎక్జయిటింగ్ కు గురి చేసే అంశమే. 'HIT' ను 7 సీక్వెల్ ల ఒక ఫ్రాంచైజీగా డైరెక్టర్ శైలేష్ కొలను, నిర్మాత నాచురల్ స్టార్ నానిగారు మలచడం జరిగిందని, ఈ 7 భాగాలూ కూడా దేనికదే యూనిక్ అండ్ స్పెషల్ అని పేర్కొన్నారు.
పోతే, హిట్ 2 మూవీ డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతుంది.