RRR సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను విశేషంగా దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ప్రేక్షకాభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నారు. మొన్నటివరకు ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్లతో సినిమా విజువల్స్ గురించి చర్చించిన కొరటాల లేటెస్ట్ గా మ్యూజిక్ పై శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న అనిరుద్ తో కొరటాల మ్యూజికల్ డిస్కషన్స్ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో మీడియాలో హల్చల్ చేస్తుంది.
కొరటాల - జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన మిగిలిన అన్ని విషయాలు కూడా మేకర్స్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.