పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్న విషయం తెలిసిందే కదా. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. విలన్గా అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, వచ్చే నెల జరగబోయే HHVM షెడ్యూల్ లో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, హాట్ బ్యూటీ నోరా ఫతేహి పాల్గొనబోతున్నారు.
మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై AM రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు.