టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 8న గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ షెడ్యూల్ కోసం ఒక స్పెషల్ జైల్ సెట్ వేస్తున్నట్లు ఫ్లాష్ బ్యాక్ జైల్ ఎపిసోడ్ తో షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.
బాలీవుడ్ గ్లామర్ డాల్ సోనాక్షి సిన్హాఈ సినిమాలో బాలయ్య సరసన జోడిగా నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్, బెంగళూరు బ్యూటీ శ్రీలీల ఒక కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. 'NBK108' ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం బాలకృష్,ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్నారు.