మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "ధమాకా". నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఫోర్త్ లిరికల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. నవంబర్ 25న విడుదల కాబోయే డు డు పాటకు సంబంధించి రేపు ఉదయం 11:01 నిమిషాలకు ప్రోమో రిలీజ్ కాబోతున్నట్టు కొంతసేపటి కృతమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.