కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తో మాస్ రాజా రవితేజ నిర్మిస్తున్న చిత్రం "మట్టి కుస్తీ". చెల్లా అయ్యావు డైరెక్షన్లో కంప్లీట్ స్పోర్ట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మట్టి కుస్తీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. RT టీం వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంయుక్త బ్యానర్ లపై రవితేజ, విష్ణు విశాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులను పలకరించబోతుంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసారు. రేపు సాయంత్రం ఆరింటికి 'చల్ చక్కని' అనే బ్యూటిఫుల్ మెలోడీని విడుదల చెయ్యబోతున్నట్టు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.