కోలీవుడ్ మూవీ "ఖైదీ" 2019లో విడుదలై ఎంతటి ప్రభంజన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో, హీరోయిన్ లేకుండా బరిలోకి దిగిన ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు.
తాజాగా ఈ సినిమా హిందీలో "భోళా" టైటిల్ తో రీమేక్ అవుతుంది. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ డైరెక్టోరియల్ లో నాల్గవ సినిమాగా తెరకెక్కుతున్న ఇందులో ఆయనే హీరోగా నటిస్తున్నారు. టబు కీలకపాత్రలో నటిస్తున్నారు. అమలాపాల్ స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు.
ఈరోజే భోళా టీజర్ రిలీజ్ అయ్యింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా భోళా టీజర్ ప్రతి ఒక్కరికి బాగా నచ్చినట్టుంది. అందుకే భోళా టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 8 మిలియన్ కు పైగా వ్యూస్ ను, 85కే లైక్స్ ను రాబట్టగలిగింది.