ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం "బేబీ". టైట్యులర్ రోల్ లో వైష్ణవి చైతన్య నటిస్తుంది. నిన్న విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పలువురు సెలెబ్రిటీలు కూడా బేబీ టీజర్ ఎంతో బావుందంటూ సోషల్ మీడియా ద్వారా తమ రివ్యూలను తెలిపారు. ఇప్పటివరకు ఈ టీజర్ 2 మిలియన్ వ్యూస్ ను రాబట్టి యూట్యూబులో టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది.
విరాజ్ అశ్విన్ , నాగబాబు, లిరిష, కుసుమ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తుండగా, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీనివాస కుమార్ నిర్మిస్తున్నారు. విజయ్ బుగ్లాని సంగీతం అందిస్తున్నారు.