వేణు మండికంటి డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్రం "శాసనసభ". ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ భకుని, రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.
పోతే, కొంచెంసేపటి క్రితమే ఈ సినిమా నుండి బిగ్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. నవంబర్ 27న మధ్యాహ్నం 03:33 నిమిషాలకు శాసనసభ ట్రైలర్ విడుదల కాబోతుందని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ట్రైలర్ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని సాప్బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్ పై తులసి రామ్, షణ్ముగం నిర్మిస్తున్నారు.