టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఈ రోజు 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చైతూకి బర్త్ డే విషెస్ ను తెలియచేస్తున్నారు. చైతు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో సూపర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పెషల్ సర్ప్రైజింగ్ న్యూస్ షేర్ చేసి, ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తిని రేపారు. చైతూకి బర్త్ డే విషెస్ తెలియచేస్తూ చేసిన ట్వీట్ లో ఆయనతో ఒక సినిమాను చెయ్యబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. మీతో క్లాసిక్ బ్లాక్బస్టర్ హిట్ తీస్తాను సర్.. వండర్ఫుల్ బ్లాక్బస్టర్ స్టోరీతో అతి త్వరలోనే మీ దగ్గరకు వస్తాను... అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం చైతు వెంకట్ ప్రభు తో ఒక ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఆపై పరశురామ్ లైన్లో ఉన్నారు.