మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గానే "గాడ్ ఫాదర్" గా ప్రేక్షకులను పలకరించారు. హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ అందుకుంది.
గత వారంలో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన గాడ్ ఫాదర్ సినిమా అక్కడ ఫుల్ హవా చూపిస్తుంది. కొన్ని రోజుల నుండి నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 మూవీస్ లో గాడ్ ఫాదర్ తెలుగు, హిందీ వెర్షన్స్ రెండూ కూడా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ 1 లో ఉంటె, తెలుగు వెర్షన్ టాప్ 3 లో కొనసాగుతుంది.
మోహన్ రాజా డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, షఫీ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ చేసారు.