సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' సినిమా ఈ నెల విడుదలై విజయం సాధించడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ టైటిల్ నచ్చక మొదట ఈ సినిమా చేయనన్నాని, డైరెక్టర్ తనను ఒప్పించాడని అన్నారు. సుడిగాలి సుధీర్ తన కష్టాన్ని నమ్ముకున్నందుకే అదృష్టం కలిసొచ్చిందని, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాగా కష్టపడే తత్వం సుధీర్ లో కనిపించిందని పేర్కొన్నారు.