బాలకృష్ణ తన 108వ సినిమాను అనిల్ రావిపూడితో చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనిల్ మాట్లాడుతూ, సినిమా పనులు జరుగుతున్నాయని, డిసెంబర్ 8వ తేదీన ఫస్టు షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుందన్నారు. బాలకృష్ణగారికి ఉన్న క్రేజ్ వేరు, నా మార్కు వేరు అని, అందువలన ఈ కాంబినేషన్ ఎలా ఉండనుందనేది అందరిలో ఆసక్తిని పెంచుతోందని అన్నారు. ఈ సినిమాలో బాలయ్య కామెడీ చేయరని కొన్ని సందర్భాల్లో నవ్వు తెప్పిస్తారని చెప్పారు.