టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఈ రోజు 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చైతు నటిస్తున్న 22 సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కొంతసేపటి క్రితమే విడుదలైంది.
నిన్న విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ లో నాగచైతన్య కళ్ళను మాత్రమే చూపించిన మేకర్స్ తాజాగా రిలీజైన పోస్టర్ లో కొంతమంది పోలీసాఫీసర్లు చైతూని బలవంతంగా పట్టుకుని గన్స్ తో బెదిరిస్తున్నట్టు చూపించారు. కానీ, చైతు కళ్ళల్లో మాత్రం ఎలాంటి బెరుకు కనిపించడం లేదు. ఈ సినిమాలో శివ అనే పోలీసాఫీసర్ పాత్రలో చైతు నటిస్తున్నట్టు తెలుస్తుంది. పోతే, ఈ సినిమాకు "కస్టడీ" అనే యూనిక్ టైటిల్ ను ఖరారు చెయ్యడం జరిగింది.
వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అరవింద్ స్వామి, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.