‘కాంతార’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కర్ణాటకలో కేజీఎఫ్-2 రికార్డును బద్దలు కొట్టింది. అక్కడ రూ.168.50 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగులో రూ.60 కోట్లు, తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో రూ.19.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.44.50 కోట్లు, హిందీలో రూ.96 కోట్లు వసూలు చేసింది.