గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం "వీరసింహారెడ్డి". ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అధికారిక ప్రకటన చేసారు. వీరసింహారెడ్డి ఫస్ట్ సింగిల్ అతి త్వరలోనే విడుదల కాబోతున్నట్టు నిన్న రాత్రి తమన్ ట్వీట్ చేసారు. దీంతో నందమూరి అభిమానులు ఫస్ట్ సింగిల్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్ విలన్గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు.