టాలీవుడ్ హీరోగా సినీ కెరీర్ ను ప్రారంభించి ఆపై నిర్మాణ రంగంలోకి, ఆపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలుపొంది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తనవంతు సేవలని అందిస్తున్నారు మంచు విష్ణు. ఇటీవలే "జిన్నా"(గాలి నాగేశ్వరరావు) గా ప్రేక్షకులను పలకరించి వారి నుండి చాలా మంచి రివ్యూలను పొందారు కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది. జిన్నా తదుపరి విష్ణు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను ఇంకా ప్రకటించలేదు.
ఈ రోజు విష్ణు 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1982, నవంబర్ 23న మద్రాస్ లో, సీనియర్ సినీనటులు డా. మంచు మోహన్ బాబు, లేట్ విద్యాదేవి దంపతులకు జన్మించారు. 2009లో విరానికా రెడ్డిని వివాహం చేసుకున్న విష్ణుకు మొత్తం నలుగురు సంతానం.
రగిలే గుండెలు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటనాజీవితాన్ని ప్రారంభించిన విష్ణు 2003లో "విష్ణు" సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసారు. మొదటి సినిమాకే విష్ణు ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.