మొన్న ... ఆట కావాలా.. పాట కావాలా.., నిన్న.. అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ ... మాస్ మసాలా సాంగ్స్ తో చిరు ప్రేక్షకాభిమానుల్లో ఫుల్ జోష్ ను నింపారు. లేటెస్ట్ గా 'బాస్ పార్టీ' అనే బిగ్గెస్ట్ మాస్ మసాలా సాంగ్ తో చిరు ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు మెగాస్టార్ చిరంజీవి - బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కుతున్న "వాల్తేరు వీరయ్య" మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ గా "బాస్ పార్టీ" విడుదల కాబోతుంది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాతో కలిసి చిరు స్టెప్స్ వెయ్యనున్నారు.
శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.