రవితేజ, శ్రీలీల కలిసి నటిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రం "ధమాకా". నక్కిన త్రినాధరావు ఈ సినిమాకు దర్శకుడు కాగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 23న తెలుగు, హిందీ భాషలలో ధమాకా సినిమా విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి "డూ..డూ" మాస్ యాంథెం లిరికల్ సాంగ్ కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో విడుదలైంది. ఈ వీడియో నవంబర్ 25 అంటే శుక్రవారం సాయంత్రం ఆరింటికి విడుదల కాబోయే మాస్ యాంథెం సాంగ్ పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. భీమ్స్ అందించిన మ్యూజిక్ ట్రాక్ చాలా బాగుంది.