రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా, విప్లవ్ కోనేటి తెరకెక్కించిన చిత్రం "తెలిసినవాళ్ళు". టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసారు. 'నీకు మాత్రమే సొంతం నేను' అని సాగే ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ మెలోడీ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల స్వరపరచగా, అంబికా పాడారు.