నాంది సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన హీరో అల్లరి నరేష్ తాజాగా విడుదలైన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో విజయపరంపరను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీకి ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలను ఇచ్చి బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఈ సందర్భంగా చిత్రబృందమంతా ఒకచోట చేరి సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కేక్ కట్ చేసి, పటాసులు కాల్చి మూవీ సక్సెస్ ను టీం అంతా సెలెబ్రేట్ చేసుకున్నారు.
AR మోహన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో అల్లరి నరేష్, ఆనంది జంటగా నటించారు. హాస్య మూవీస్, జీ 5 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.