కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సార్ అనే డైరెక్ట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ ని పలకరించబోతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది.
తాజాగా ధనుష్ తన రెండో తెలుగు సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు ఈ రోజే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. పోతే, ఈ సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో త్రిభాషా చిత్రంగా తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ LLP బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, నారాయణ్ దాస్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుందని మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.