గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గురువారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కతావతే మయూర్ అశోక్ (IAS) గారిని మర్యాదపూర్వకంగా కలిసి తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గంలో తీవ్ర రూపం దాల్చిన వీధి కుక్కల బెడదపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే మురుగు కాలువల (సైడ్ డ్రైన్లు) పూడికతీత పనులు నిలిచిపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య లోపాలు, చెత్త సక్రమంగా తొలగించకపోవడం, వెలగని వీధి దీపాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కమిషనర్‌ను డిమాండ్ చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa