ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబటి రాంబాబును పరామర్శించిన చింతలపూడి నియోజకవర్గ వైసీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 03:35 PM

 మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు అంబటి రాంబాబును చింతలపూడి నియోజకవర్గానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన నాయకులు, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో అంబటి ఆరోగ్య పరిస్థితి, పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తూ ధైర్యం చెప్పారు. అనంత‌రం పార్టీ నాయకులు మాట్లాడుతూ అంబటి రాంబాబు పార్టీకి చేసిన సేవలు అపారమని, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకుడని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు పార్టీ శ్రేణులంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏ పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. అంబటి రాంబాబు ఈ సందర్భంగా వచ్చిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa