"సాహసం శ్వాసగా సాగిపో" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ నటి మంజిమా మోహన్. ఆపై కోలీవుడ్, మాలీవుడ్ లలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి, ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
రీసెంట్గానే మంజిమ కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా అఫీషియల్ గా తెలిపింది. తాజాగా గౌతమ్ కార్తీక్, మంజిమాల వివాహం జరిగినట్టు తెలుస్తుంది. ఈ మేరకు వీరిద్దరి వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ రోజు ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో గౌతమ్, మంజిమాల వివాహం జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వీరి వివాహం సింపుల్ అండ్ స్వీట్ గా జరిగినట్టు తెలుస్తుంది. గౌతమ్, మంజిమ ఇద్దరూ కూడా మ్యారేజ్ పిక్స్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానులకు ఈ శుభవార్తను తెలిపారు.