అక్టోబర్ లో జపాన్లో విడుదలైన RRR సినిమాకు అక్కడి జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. RRR జపాన్ బాక్సాఫీస్ కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.. ఫస్ట్ డే కలెక్షన్స్ కన్నా 38వ రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయంటే... జపాన్ బాక్సాఫీస్ పై RRR ఎంతటి భీకర దండయాత్ర చేస్తుందో అర్ధం అవుతుంది.
RRR మూవీ రీసెంట్గానే జపాన్లో బాహుబలి 2 కలెక్షన్స్ ను క్రాస్ చేసి, ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక, మరికొన్ని రోజుల్లోనే జపాన్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా RRR అవతరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.