డిసెంబర్ 1వ తేదీన అంటే ఈ గురువారం థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలలో "గోల్డ్" మూవీ ఒకటి. 'ప్రేమమ్' ఫేమ్ ఆల్ఫోన్స్ పుత్రేన్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్, కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, గోల్డ్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.
ఈ సినిమాకు రాజేష్ మురుగేశన్ సంగీతం అందిస్తున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.