రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు గారు మాట్లాడుతూ..తాను నిర్మిస్తున్న "వారిసు" మూవీ తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కాబోతుందని అఫీషియల్ గా తెలిపారు. తెలుగులో ఈ సినిమాకు "వారసుడు" టైటిల్ అన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు, హిందీలో ఈ మూవీకి "వారిస్" అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో, యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా జంటగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
పోతే, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా తమిళ, తెలుగు భాషలలో విడుదల కాబోతుంది. మరి, హిందీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా ఎనౌన్స్ చెయ్యాల్సి ఉంది.