కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యపై బయోపిక్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధరామయ్యగా నటించేందుకు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని మేకర్స్ సంప్రదించారని సమాచారం. కాగా, ఈ ప్రాజెక్టుకు సిద్ధరామయ్య పచ్చజెండా ఊపాల్సి ఉంది. సిద్ధరామయ్యపై బయోపిక్ నిర్మించేందుకు ఆయన అభిమానులు, మద్దతుదారులు సిద్ధమయ్యారు. మరోవైపు తన బయోపిక్ లో తాను నటించడం లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే, తన బయోపిక్ ను తెరకెక్కించేందుకు సిద్ధరామయ్య వచ్చే వారం తన సమ్మతిని తెలియజేస్తారని ఆయన అభిమానులు తెలిపారు.