'కుమారి 21F' తదుపరి డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్న చిత్రం "18 పేజెస్". ఇందులో యంగ్ హీరో హీరోయిన్లు కార్తికేయ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటిస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో 18 పేజెస్ ఫైనల్ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంతలా అంటే, ఈ చలికాలంలో హైదరాబాద్ నగర వీధుల్లో ఫుల్ నైట్ ఔట్ షూటింగ్ జరుగుతుంది. ఈ మేరకు హీరో కార్తికేయ సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు కథను అందించారు. సుకుమార్ రైటింగ్స్, GA 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి