నటసింహం నందమూరి బాలకృష్ణగారు ఫస్ట్ టైం హోస్ట్ చేస్తున్న టాక్ షో "అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2". ప్రముఖ సినీతారలతో పాటుగా ఈ సీజన్ లో సరికొత్తగా రాజకీయ ప్రముఖులతో కూడా బాలయ్య చిట్ చాట్ నిర్వహిస్తూ, షోపై ప్రేక్షకుల ఎక్జయిట్మెంట్ లెవెల్స్ ను మరింత పెంచేశారు.
తాజాగా అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ కు దిగ్గజ ఫిలింమేకర్స్ దగ్గుబాటి సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారు, కోదండ రామిరెడ్డి గారు విచ్చేసారు. ఈ మేరకు ఆహా వీడియో కొన్ని పిక్స్ ను షేర్ చేసి, ఈ ఎపిసోడ్ డిసెంబర్ 5న ప్రీమియం కాబోతుందని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది.