విశ్వక్ సేన్ దర్శకత్వం చేసి, హీరోగా నటిస్తున్న చిత్రం "ధమ్కీ". ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. విశ్వక్, నివేదా 'పాగల్' చిత్రంలో కలిసి నటించగా, ఆ సినిమా డీసెంట్ హిట్ అయ్యింది. దీంతో ఈ కాంబోపై ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి.
తాజాగా ఈ రోజు నివేదా పేతురాజ్ పుట్టినరోజు సందర్భంగా ధమ్కీ టీం నుండి స్పెషల్ సర్ప్రైజ్ వచ్చింది. ధమ్కీ నుండి నివేదా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. పోతే, ఇందులో 'కీర్తి' అనే గ్లామరస్ రోల్ లో నివేదా నటించబోతుందని తెలుస్తుంది.
రీసెంట్గా రిలీజైన ధమ్కీ ట్రైలర్ కు ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషలలో ధమ్కీ మూవీ విడుదల కాబోతుంది.
![]() |
![]() |