హనుమాన్ టీజర్ కి ఆడియన్స్ నుండి వస్తున్న విశేష స్పందన కారణంగా ఆ శ్రీరాముడికి కృతజ్ఞతలు తెలుపుకుని, ఆశీర్వాదం తీసుకునేందుకు హనుమాన్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయోధ్యా నగరానికి బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రోజు శ్రీ రామ జన్మస్థలం రామమందిరాన్ని దర్శించుకుని, పూజలు చేసారు. ఆ శ్రీరాముడి దివ్యాశీస్సులను పొందారు. ఈ మేరకు రామజన్మ స్థలంలో తేజ, ప్రశాంత్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారతదేశపు ఫస్ట్ సూపర్ హీరో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినోద్ రాయ్ కీరోల్స్ లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa