పాన్ ఇండియా సినిమాగా విడుదలై, అంతర్జాతీయంగా ప్రభంజనం సృష్టిస్తున్న RRR సినిమా ఖాతాలో మరొక ఇంటర్నేషనల్ అవార్డు చేరింది. రీసెంట్గానే సాటర్న్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అవార్డు గెలుచుకున్న RRR కు తాజాగా సన్సెట్ సర్కిల్ అవార్డ్స్ వారు అందించే ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం అవార్డు కూడా వచ్చింది. దీంతో ఇంటర్నేషనల్ వైడ్ RRR క్రేజ్ మరింత పెరిగినట్టు తెలుస్తుంది.
ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీ ఎస్ ఎస్ రాజమౌళి గారు తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్త సినీ ప్రేక్షకులను, విమర్శకులను, సినీప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో స్టార్ హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. అజయ్ దేవగణ్, ఆలియాభట్, ఒలీవియా మోరిస్ ముఖ్యపాత్రల్లో నటించారు.