టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బుధవారం ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది దాదాపు 11 గంటల పాటు విజయ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 'లైగర్' సినిమా ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ చేపట్టింది. ఇటీవల పూరీ జగన్నాథ్, ఛార్మీలను కూడా ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ బ్యాంక్ స్టేట్‌మెంట్లను ఈడీ అధికారులు పరిశీలించారు.