కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ ప్రస్తుతం "వారిసు" మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనెర్గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
లేటెస్ట్ గా విజయ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ "అదిరింది" రీ రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ నాల్గవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని సుదర్శన్ 35MM థియేటర్లో అదిరింది స్పెషల్ షో జరగనుంది.