'ప్రేమమ్' సినిమా మలయాళంలో ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ టాప్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. ఐతే, ఆ మూవీ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ మాత్రం సుదీర్ఘ విరామం తీసుకుని రేపే "గోల్డ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన ఈ సినిమా రేపు తమిళ్, మలయాళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. సెన్సార్ బృందం చేత క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ హైప్స్ ఐతే ఉన్నాయి కానీ, చిత్రబృందం నిల్ ప్రమోషన్స్ నిరాశపరిచే విధంగా ఉన్నాయి.
ఈ సినిమాకు రాజేష్ మురుగేశన్ సంగీతం అందిస్తున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.