పెదరాయుడు` గెటప్ కి తెలుగు లోగిళ్లలో ఉన్న ఐడెంటిటీ ఎంతో గొప్పది. `పెదరాయుడు` అనగానే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గుర్తుకొస్తారు. పెదరాయుడు డాడ్ రజనీకాంత్ కూడా గుర్తుకొస్తారు. ఆ సినిమా రిలీజైన తర్వాత పెదరాయుడు గెటప్ కి బోలెడన్ని స్పూఫ్ లు మన సినిమాల్లో వచ్చేశాయి. ఇప్పటికీ ఆ గెటప్ ని ఏదో ఒక సినిమాలో చూస్తూనే ఉంటాం.
అయితే అంతగా ప్రాముఖ్యత ఉన్న అదే గెటప్ లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కనిపిస్తే ఎలా ఉంటుంది? అదే వైట్ అండ్ వైట్ పంచెకట్టు.. నెరిసిన తల.. గడ్డం.. రెబాన్ కళ్లద్దాలతో పెదరాయుడినే తలపిస్తే ఇక అభిమానులు ఆగుతారా? ఆ రూపంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపించకుండా ఉండరూ! జక్కన్న ఇలాంటి గెటప్ లో ఏదైనా సినిమాలో కనిపిస్తే బావుండునని ఆశపడతారు కూడా. `బాహుబలి` చిత్రంలో `మనోహరి` పాటలో కల్లు కాంపౌండ్ క్యాషియర్ గా భలేగా ఝలక్ ఇచ్చిన జక్కన్న మరోసారి తెరపై కనిపించే ఆస్కారం ఉంటుందేమో చూడాలి.
ఇకపోతే ఇటీవలే కుమారుడు కార్తికేయ పెళ్లి వేడుకను అత్యంత ఖరీదైన ఫెయిర్ మౌంట్ (జైపూర్) భవంతిలో ఎంతో ఘనంగా జరిపించాడు రాజమౌళి. ఈ వేడుకలో రాజమౌళి - కీరవాణి కుటుంబాలు సహా అటు పెళ్లికూతురు పూజా ప్రసాద్ తరపున జగపతిబాబు కుటుంబం ఎంతో సందడి చేశారు. ఆ సందర్భంలోనే ఇదిగో ఇలా జక్కన్న పెదరాయుడు గెటప్ తో మైమరిపించాడు. తనతో పాటే ఫోటోలు దిగిన వాళ్లలో రమా రాజమౌళి సహా ఇతర కజిన్స్ చాలా లక్కీ. ఎందుకంటే ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి కార్తికేయ పెళ్లి వేడుకను జరిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa