ఏఆర్ మోహన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' చిత్రం గ్రాండ్ గా నవంబర్ 25న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.29 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ సినిమాలో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తుండగా, హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కలెక్షన్స్ :::::
నైజాం - 1.22 కోట్లు
సీడెడ్ - 31 L
ఆంధ్రాప్రదేశ్ - 1.69 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 3.11 కోట్లు (1.64 కోట్ల షేర్)
KA+ROI+OS - 20 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 3.29 కోట్లు (1.73 కోట్ల షేర్)