సూపర్ స్టార్ మహేష్ బాబు కొంతసేపటి క్రితమే ట్విట్టర్ లో మైండ్ బ్లోయింగ్ పోస్ట్ ఒకటి చేసారు. తన లేటెస్ట్ స్టిల్ ను ఒకటి పోస్ట్ చేసి, బ్యాక్ టు వర్క్ అని కామెంట్ చేసారు. ఈ లేటెస్ట్ స్టిల్ లో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో సూపర్ కూల్ గా కనిపిస్తున్నారు. మరి, త్వరలోనే SSMB 28 షూటింగ్ కూడా షురూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందుతున్న SSMB 28 లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.