ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మాతగా మారబోతున్న స్టార్ హీరోయిన్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 03, 2022, 06:39 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు "సర్కారువారిపాట" తో గ్లామరస్ హీరోయిన్ గా మారిపోయిన ట్యాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని తో కలిసి "దసరా" పాన్ ఇండియా మూవీ లో నటిస్తుంది. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ ల "భోళా శంకర్" లో కీర్తి ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. ఇవి కాకుండా రెండు కోలీవుడ్ సినిమాలలో కీర్తి హీరోయిన్ గా నటిస్తూ... ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది కీర్తి నుండి కొత్త సినిమాలు ఇక రానట్టే. అన్ని వచ్చే ఏడాదే రానున్నాయి.


తాజా బజ్ ప్రకారం, కీర్తి నిర్మాతగా మారాలని ఆలోచిస్తుందట. ఈ మేరకు కొన్ని స్క్రిప్ట్ లను కూడా కీర్తి అండ్ టీం వింటున్నారట.  త్వరలోనే కీర్తి ప్రొడ్యూస్ చెయ్యబోతున్న ఫస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రాబోతుందని వినికిడి. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com