'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి, డీసెంట్ హిట్ కొట్టిన యంగ్ హీరో విశ్వంత్ లేటెస్ట్ గా తన కొత్త సినిమాను ప్రకటించాడు. కృష్ణ చైతన్య డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీజిత ఘోష్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో ఉండే కథలు, వాటిలోని ట్విస్టులు ఆడియన్స్ ను థ్రిల్ చెయ్యడం ఖాయమని చిత్రబృందం పేర్కొంది. పోతే, ఈ సినిమాలో సునీల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దండమూడి అవనింద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.