పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబోలో ఒక సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో భీకర ప్రచారం జరుగుతున్నప్పటికీ మేకర్స్ నుండి కానీ, హీరో నుండి కానీ ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక క్లారిటీ మాత్రం రాకపోవడం విశేషం.
తాజా బజ్ ప్రకారం, రీసెంట్గానే సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించి మారుతీ అప్పుడే మూడు కీలక షెడ్యూల్స్ ను శరవేగంగా పూర్తి చేసారంట. అందులో మొదటి షెడ్యూల్ ప్రభాస్ లేకుండానే జరిగింది. సెకండ్ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనగా, మళ్ళీ మూడో షెడ్యూల్ లో ప్రభాస్ లేకుండానే షూటింగ్ పూర్తయ్యింది.
ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు ఏ విషయం మాట్లాడుకున్నా, అదంతా కేవలం సోషల్ మీడియా సమాచారమే కానీ ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు.