బాబీ డైరెక్షన్లో పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సినిమా "వాల్తేరు వీరయ్య". ఇందులో శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల్లో గ్రాండ్ రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.
తాజా సమాచారం ప్రకారం, వాల్తేరు వీరయ్య సినిమా ఓవర్సీస్ హక్కులను ప్రఖ్యాత PHF సంస్థ చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య సినిమాను PHF సంస్థ ఓవర్సీస్ లో గ్రాండ్ రిలీజ్ చేయబోతుంది.