ప్రతినిధి, నెపోలియన్ వంటి ఇంటరెస్టింగ్ సినిమాలకు రచయితగా పనిచేసిన ఆనంద్ రవి కథ , స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన కొత్త చిత్రం "కొరమీను". ఇందులో ఆయనే హీరోగా నటిస్తున్నారు. శ్రీపతి కర్రి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు డిసెంబర్ 15వ తేదీన కొరమీను సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
కిషోరీ ధాత్రక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హరీష్ ఉత్తమన్, శత్రు, రాజా రవీంద్ర, జబర్దస్త్ ఇమ్మానుయేల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పెళ్లకూరు సామన్యారెడ్డి ఈ సినిమాను నిర్మించారు.