అడివి శేష్ రీసెంట్ మూవీ "హిట్ 2" ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదలై, దుమ్ము రేగకొడుతుంది. శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులు, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ నంబర్స్ ను నమోదు చేస్తుంది. హిట్ 2 మూవీ ప్రమోషనల్ కంటెంట్, శేష్ బ్రాండ్ ఇమేజ్ కారణంగా హిట్ 2 తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 11కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక, USA లో ఐతే, కొత్తగా చెప్పేదేముంది. రెండో రోజుకే హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసి, వన్ మిలియన్ డాలర్ మార్క్ ను అందుకునేందుకు పరిగెడుతుంది.