నాచురల్ స్టార్ నాని "పిల్ల జమిందార్" చిత్రంతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ హరిప్రియ. కన్నడలో పాతికకు పైగా సినిమాలలో నటించి, స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది. టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గారి జై సింహా చిత్రంలోనూ హరిప్రియ ఫిమేల్ లీడ్ లో నటించింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ రోజు హరిప్రియ తన బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్ధం చేసుకుంది. బెంగుళూరులోని తన నివాసంలో జరిగిన ఒక ప్రైవేట్ సెరిమోనీ లో ప్రేమికుడు, నటుడు వసిష్ఠ సింహాతో నిశ్చితార్ధం చేసుకుంది. త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారు.