పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో "సాహో" వంటి ఔటండౌట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించి ప్రేక్షకాభిమానుల విశేష ఆదరణకు నోచుకున్నారు డైరెక్టర్ సుజీత్. అంతకుముందు శర్వానంద్ తో "రన్ రాజా రన్" ను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సుజీత్ తన నెక్స్ట్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. DVV దానయ్య గారు ఈ సినిమాను నిర్మించబోతున్నారట. ఈ మేరకు రేప్ ఉదయమే మేకర్స్ నుండి అఫీషియల్ అప్డేట్ రాబోతుందని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. మరి ఈవార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.