కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కథ - స్క్రీన్ ప్లే అందించిన చిత్రం "బాబా". ఈ సంవత్సరంతో బాబా విడుదలై ఇరవై ఏళ్ళు పూర్తవుతున్నాయి. డిసెంబర్ 12న రజిని బర్త్ డే కావడంతో బాబాను రీ రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు డబ్బింగ్ తదితర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా బాబా రీ మాస్టర్డ్ వెర్షన్ అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది.
సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను లోటస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రజినినే సొంతంగా నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించారు. రమ్యకృష్ణ ప్రత్యేక అతిధి పాత్రలో మెరిశారు.