ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణ్ రామ్ మాస్ లుక్ తో అదరగొట్టేస్తున్నాడే

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 05, 2019, 12:48 PM

ఎన్టీఆర్ చిత్రంలో కీలకమైన హరికృష్ణ పాత్రను ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ పోషిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే కళ్యాణ్ రామ్ లుక్ రివీల్ అయ్యింది. బాలకృష్ణ తో కలిసి ఉన్న కళ్యాణ్ రామ్ లుక్ ను గతంలో విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా మరో స్టిల్ ను విడుదల చేశారు. ఈ స్టిల్ లో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ మాస్ ఆడియన్స్ ను అలరించే విధంగా ఉన్నాడు. షర్ట్ బటన్స్ విప్పి  మెడలో రుద్రాక్ష మాల ధరించి  క్లీన్ షేవ్ తో వేలికి ఉంగరంతో నిజంగా తండ్రిని గుర్తు చేసేలా కళ్యాణ్ రామ్ లుక్ ఉంది.

ఎన్టీఆర్ చిత్రీకరణ సమయంలో హరికృష్ణ మరణించాడు. ఆ కారణంగానే ఈ చిత్రంలో హరికృష్ణ పాత్ర నిడివిని కాస్త పెంచారనే టాక్ వస్తోంది. హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్ సినిమాలో హరికృష్ణ పాత్రపై అందరి దృష్టి కేంద్రీకృతం అయ్యి ఉంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో హరికృష్ణ పాత్ర ఎక్కువగా ఉండక పోవచ్చు. కాని ఎన్టీఆర్ మహానాయుడు సినిమాలో మాత్రం హరికృష్ణ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.

నాన్న పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ సినిమాలో ఏ పాత్ర ఎంత మేరకు చూపించాలో అంత వరకు చూపించారని  అలానే నేను నటించిన పాత్రను కూడా ఆ మేరకే క్రిష్ చూపించాడంటూ తాజా ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదల కానుకండగా  ఫిబ్రవరిలో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa